నందమూరి బాలకృష్ణ-‘అఖండ 2’ మూవీ డిసెంబర్ 12న అనగా రేపు విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. అఖండ 2 ప్రీమియర్ షోలు నిర్వహణకు అనుమతి ఇవ్వడం, టికెట్ రేట్లు పెంచడంపై సవాల్ చేస్తూ లంచ్-మోషన్ పిటిషన్ దాఖలు కాగా.. తాజాగా అఖండ- 2 నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేస్తూ ప్రీమియర్ షోతో పాటు టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు.

