ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం నార్వే రాజధాని ఓస్లో (Oslo)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నోబెల్ బహుమతి గ్రహీత, వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో హాజరు కాలేదు. దీంతో ఈ బహుమతిని మచాడో కుమార్తె అనా కొరీనా సోసా స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మచాడో ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. మచాడో.. వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. ‘ఈ బహుమతి వెనుజువెలా ప్రజలకు అంకితం’ అని భావోద్వేగంతో ప్రసంగించారు.

