ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినీ మచాడో అజ్ఞాతం వీడారు. దాదాపు ఏడాది పాటూ అజ్ఞాతంలో ఉన్న ఆమె తాజాగా నార్వేలో ప్రత్యక్షమయ్యారు. నార్వేలోని ఓ హోటల్ వద్ద బహిరంగంగా కనిపించారు. తన మద్దతుదారులకు అభివాదం చేశారు. నిన్న నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే మచాడో అజ్ఞాతం వీడి పబ్లిక్‌లోకి వచ్చారు.

