సూర్యాపేట జిల్లాలో నూతనకల్ మండలం లింగంపల్లిలో సర్పంచ్ ఎన్నికలు ప్రచార వేళ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఒకరి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపింది. కాంగ్రెస్కు చెందిన సుమారు 70 మంది కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడి, హైదరాబాద్కు తరలించే సమయంలో మార్గమధ్యంలో మృతి చెందాడు.

