రాజీనామాలు చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల్లో ఇద్దరు వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నారు. మండలి చైర్మన్ గా కూడా ఉన్న జకియా ఖానం తన రాజీనామ లేఖను ఉపసంహరించుకున్నట్లు శాసన మండలి చైర్మెన్ మోషేన్ రాజుకు చెప్పారు. తాను పునరాలోచన చేసుకున్నానని రాజీనామా లేఖ ఉపసంహరించుకున్నానని చైర్మెన్ మోషేన్ రాజుకు లేఖ ఇచ్చారు. మరో ఎమ్మెల్సీ పోతుల సునీత విచారణకు హాజరు కాలేదు. పోతుల సునిత విచారణ హాజరు కాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

