విజయనగరంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ చనిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జ్వరంతో పాటు శరీరంలో నల్లటి చుక్కలాంటి గాయం, తీవ్రమైన అలసట, వణుకులు, శ్వాసకోస ఇబ్బందులు రావడంతో
కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట టైఫాయిడ్ గా గుర్తించి చికిత్స అందించారు వైద్యులు. చివరికి ఆయాసం పెరిగి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. వైద్యులు లోతైన పరీక్షలు చేయగా ఫైనల్ గా స్క్రైబ్ టైఫిస్ లక్షణాలతో మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

