డిసెంబర్ 4న జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ముందస్తు వేడుకగా విశాఖపట్నంలో నిర్వహించిన ‘సర్గమ్ 2025.. ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా’ కార్యక్రమం సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శనివారం సాయంత్రం సముద్రిక ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుక సముద్రతీర నగరానికి మరింత శోభ తీసుకొచ్చింది.

