దిత్వా తుఫాన్ బలహీన పడుతోంది. తీరాన్ని తాకే అవకాశం లేదని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు తుఫాన్ కదులుతుంది. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. తీరం వెంబడి గంటకు 45- 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

