నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తోపాటు మరో నలుగురిపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇచ్చిన సమాచారంతో వారిపై నేరపూరిత కుట్ర అభియోగాలు మోపినట్లు ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు. వీరు కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీరందరూ కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆసులపై అధికారాన్ని పొందారని వెల్లడించింది.

