రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని సూచించారు. అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలూ పరీష్కరిస్తామని స్పష్టం చేశారు.

