కేబినెట్ సమావేశంలో తప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన సెక్షన్ ఆఫీసర్ కె.విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హోర్డింగ్‌ల లైసెన్సింగ్‌పై చర్చ జరగాల్సిన సమయంలో పొరపాటున మరో ఫైల్ రావడంతో సీఎం, మంత్రులు అసహనానికి గురయ్యారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సరైన ప్రజెంటేషన్‌ను సమర్పించారు. అనంతరం ఆ అధికారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించి అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

