రాపిడో బైక్ డ్రైవర్ ఖాతాలో రూ. 331 కోట్ల లావాదేవీ జరిగిన షాకింగ్ మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈకేసులో ED చర్యలు ప్రారంభించింది. ఆ క్యాబ్ డ్రైవర్ పేరు, పత్రాలను ఉపయోగించి ఒక మ్యూల్ అకౌంట్ సృష్టించబడింది. ఆ డబ్బును ఉదయపూర్ లో జరిగిన వీఐపీ వివాహానికి నిధులు సమకూర్చారని . ఉదయ్‌పూర్‌లో నేత్ర మంతెన–వంశీ గాదిరాజుల పెళ్లి వేడుకలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. గుజరాత్ యువ రాజకీయ నాయకుడికి, ఫార్మా కింగ్ మంతెన రామరాజు నిర్వహించిన ఈ పెళ్లికి సంబంధాలున్నట్లు వెల్లడైంది.

