కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. యూనివర్సిటీలో ఇటీవల పలు అవకతవకల నేపథ్యంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ ఛార్జీల నియామకం తదితర ఘటనలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీలో ఏం జరుగుతోందో వివరణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇది జరిగిన కాసేపటికే వీసీ నంద కుమార్ రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

