హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కోకాపేటలోని నియోపోలీస్ భూములకు రెండో విడత ఈ వేలం నిర్వహించింది. శుక్రవారం ఈ భూములకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151. 25 కోట్ల ధర పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 16లో ఎకరానికి రూ.147.75 కోట్లు ధర వచ్చింది. రెండో విడతలో వేలం 9.06 ఎకరాలకు 1,352 కోట్లను హెచ్ఎండీఏ పొందింది. ప్లాట్ నెంబర్16లో 5.03 ఎకరాలకు రూ. 743 కోట్లు హెచ్ఎండీఏకి వచ్చాయి.

