ఇప్పుడు యావత్ ప్రపంచంలో ‘కృత్రిమ మేధస్సు’ (ఏఐ) బూమ్ నడుస్తోంది. అయితే, దీని తర్వాత జరగబోయే భారీ టెక్ విస్ఫోటనం గురించి హింట్ ఇస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు మరో ఐదేళ్లలోగా అత్యంత ఉత్తేజకరమైన దశకు, పరాకాష్టకు ‘క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ’ చేరుకుంటుందని పిచాయ్ అంచనా వేశారు. ఐదేళ్ల క్రితం ఏ దశలో ఏఐ ఉందో, ఐదేళ్ల తర్వాత అదే దశలో ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు.

