కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్లు పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండని హరీశ్‌రావు తెలిపారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడు తెలంగాణను మోసం చేస్తాడా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాల కలను, కోట్ల మంది కలను కేసీఆర్ నిజం చేసిండని తెలిపారు.

