బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. పలు అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్(ఆర్ఇపిఎం) స్కీమ్ స్వయం సమృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రూ.9,858 కోట్లతో పుణె మెట్రో విస్తరణను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ.1,457 కోట్లతో ద్వారా-కనాలుస్ రైల్వే డబ్లింగ్ లైన్‌కు.. బద్లాపూర్-కర్జత్ మధ్య మూడు, నాలుగో రైల్వేలైన్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

