హిడ్మా మరణంతో మావోయిజం దేశంలో పూర్తిగా కూలిపోతుందన్న మాటలు వినిపించాయి. కానీ ఇదే సమయంలో, హిడ్మా ఉన్న గ్రామం నుంచి అతని బంధువైన ఒకరు మళ్లీ వచ్చాడన్న వార్తలు వెలువడటంతో మావోయిజం చర్చ మరోసారి హీట్గేర్లోకి వెళ్లింది. అతని పేరు బర్సే దేవ్. హిడ్మా చేసిన ప్రధాన ఆపరేషన్ల వెనుక వాస్తవానికి దేవ్ స్ట్రాటజీ ఉండేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అతడు రంగంలోకి దిగాడన్న ఒక్క ప్రచారమే మావోయిజం మరోసారి జోరందుకుంటుంది.. అనే అనుమానాలను పెంచుతోంది.

