ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 29న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 27 నుండి మొదటి విడత నామినేషన్ ప్రారంభం కానుంది. అలాగే, నవంబర్ 30 నుండి రెండవ విడత నామినేషన్.. డిసెంబర్ 3 నుండి మూడవ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రభుత్వం కొత్త పథకాలు, శంకుస్థాపనలు లబ్ధిదారుల జాబితాలు ప్రకటించడంపై నిషేధం విధించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు.

