తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 11న, రెండో దశ డిసెంబర్ 14న, మూడో దశ డిసెంబర్ 17న నిర్వహిస్తారు. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ప్రతి దశలోనూ మధ్యాహ్నం 2 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమై, అదే రోజు సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటిస్తారు.

