ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో బద్దలైన ఓ అగ్నిపర్వత ధూళి ఢిల్లీ మీదుగా కదులుతున్నది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అవి దేశ రాజధానికి చేరుకున్నాయని ఇండియా మెట్స్కై వెదర్ వెల్లడించింది. ఇథియోపియాలోని ఎర్టా అలే రేంజ్లో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం (Hayli Gubbi Volcano) సుమారు 10 వేల ఏండ్ల తర్వాత ఆదివారం పేలిన విషయం తెలిసిందే. దీని నుంచి పెద్ద ఎత్తున బూడిద, సల్ఫర్డయాక్సైడ్, ధూళితో కూడిన పొగ మబ్బులు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.

