అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో సుదీర్ఘంగా నిర్బంధించి, వేధింపులకు పాల్పడ్డారు. ఆమె పాస్‌పోర్ట్‌ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఆమె జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించారు. దానితో “అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనా దేశంలో భాగం. కాబట్టి మీ భారతీయ పాస్‌పోర్ట్ చెల్లదు” అని వారు స్పష్టం చేశారు. చివరకు దౌత్య అధికారుల జోక్యంతో నిర్భంధం నుంచి ఆమె బయటపడింది. ఈ క్రమంలో బాధిత మహిళ ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి చేసింది.

