జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ ఆదివారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధానమంత్రి సనే తకైచితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు మెలోనితో జరిగిన సమావేశంలో భారతదేశం, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై ప్రధాని చర్చించారు. అనంతరం జపాన్ ప్రధాని తకైచితో ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు.

