అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళంలో ఆదివారం నాడు రెడ్డి సంక్షేమ సంఘం కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతానికి నేను రైతును మాత్రమే అని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. 20 ఏండ్ల క్రితం నుంచే పవన్ కల్యాణ్ తనకు మిత్రుడని తెలిపారు. తాను ఎప్పుడూ పవన్ కల్యాణ్‌ను విమర్శించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పవన్ కల్యాణ్‌ను విమర్శించనని చెప్పారు.

