పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా, సినిమా పైరసీ చర్యలు అదుపులోకి రావడం లేదు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసి, ఐబొమ్మతో పాటు బొప్పం టీవీ వంటి ప్లాట్ఫార్మ్లను మూసివేసినా, పైరసీ పెద్దగా తగ్గలేదు. ఆగింది ఐబొమ్మ మాత్రమే, శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలన్నీ అదే రోజున పైరసీ( Piracy) సైట్లలో ప్రత్యక్షమయ్యాయి. ముఖ్యంగా ఐబొమ్మ కంటే ముందే అక్రమంగా సినిమాలను అప్లోడ్ చేస్తూ వచ్చిన మూవీరూల్జ్ మరోసారి కొత్త చిత్రాలను పూర్తిగా లీక్ చేసింది.

