భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్లో సత్తా చాటాడు. వరుస విజయాలతో ఫైనల్కు చేరిన లక్ష్య అక్కడ కూడా అదే జోరు కనబర్చాడు. ఫైనల్లో యుషి తనాక (జపాన్)ను ఢీ కొట్టిన అతడు వరుస
సెట్లలో విజయం సాధించాడు. 21-15, 21-11 తేడాతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ముద్దాడాడు.

