అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాశారు. వివరణకు ఇచ్చేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఆయన లేఖలో కోరారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో ఆదివారం మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే స్పీకర్ రెండుసార్లు దానంకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది విచారణ ముగిసింది.

