>ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ వాణిని ప్రతిబింబించేలా జీ20 సదస్సు – 2025 ప్రకటన విడుదల చేసింది. అన్ని రూపాల్లోని, అన్నిరకాల ఉగ్రవాదాన్ని జీ20 సదస్సు ఖండించింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపర్చడంపై ఫోకస్ పెడతామని పేర్కొంది. ప్రస్తుతానికి చాలా ఆఫ్రికా దేశాలు ఈ టెక్నాలజీ కోసం భారత్‌పైనే ఆధారపడుతున్నాయి. సురక్షితమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన, జవాబుదారీగా ఉండే డిజిటల్ – ఎమర్జింగ్ టెక్నాలజీలు, ఏఐ టెక్నాలజీలను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడతామని జీ20 దేశాలు పేర్కొన్నాయి.

