డెక్కన్ సూత్రాల ప్రకారం ఆహార భద్రతపై జీ20 కూటమి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 సదస్సు – 2025 వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలు హామీలకు కట్టుబడి పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక వనరులను సకాలంలో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.అంతర్జాతీయ స్థాయి సంస్థలు, వేదికల్లో వాణిని వినిపించేలా గ్లోబల్ సౌత్‌కు సముచిత స్థానాన్ని కల్పించాలన్నారు.

