పశ్చిమబెంగాల్ లో ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పని ఒత్తిడిని తట్టుకోలేక మరో అధికారిణి ఆత్మహత్యకు పాల్పడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి స్పందించారు. ‘ఇంకెంత మంది ఎన్నికల అధికారులు చనిపోవాలి..’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక పద్ధతి అనేది లేకుండా రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం అధికారులపై పనిభారం పెంచుతోందని మమతాబెనర్జి మండిపడ్డారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

