అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు. క్రిస్మస్ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దాదాపు 200 మందికిపైగా హాజరయ్యారు. రాత్రి 7:30 గంటల సమయంలో అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో అక్కడ 200 నుంచి 300 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

