జక్కన్నకు సపోర్ట్ చేస్తూ తన ‘X’లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాజమౌళిని విమర్శిస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రాజమౌళిపై విషం కక్కుతోన్న సో కాల్డ్ ధర్మ పరిరక్షకులు భారతదేశంలో నాస్తికునిగా ఉండడం నేరం కాదని తెలుసుకోవాలి.
రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా దేవుడిని నమ్మేవారు జీవితంలో చూడని విజయాన్ని, సంపదను చూశారు. దీన్ని బట్టి దేవుడు భక్తుల కంటే నాస్తికులకే ఎక్కువ ప్రేమిస్తుండాలి. దేవునికి రాజమౌళితో ఎలాంటి సమస్య లేదు. మరి మీకెందుకు ఇబ్బంది?.’ అంటూ సెటైరికల్‌గా ప్రశ్నించారు.

