ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు కొనసాగిస్తున్న హమాస్‌కు చెందిన అతిపెద్ద భూగర్భ టెర్రర్ కాంప్లెక్స్‌ను ఇజ్రాయెల్ దళాలు గాజాలో గుర్తించాయి. ఈ సొరంగం దాదాపు 7 కిలో మీటర్ల పొడవు, 25 మీటర్ల లోతుతో ఉంది. కేవలం 80 గదులు, వెస్ట్రన్ టాయిలెట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లతో సహా దాదాపు ఒక భూగర్భ నగరమే నిర్మించుకున్నట్లు ఐడీఎఫ్ నిర్ధారించింది. హమాస్ కీలక నేతలైన మొహమ్మద్ సిన్వార్ సహా పలువురు ఇందులో తలదాచుకునేవారని ఇజ్రాయెల్ తెలిపింది.

