భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్రపతి ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు బయలుదేరారు.

