బిహార్‌లో గురువారం ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది శ్రేయసి సింగ్ ఆమె భారతీయ క్రీడా రంగంతో పాటు బిహార్ రాజకీయాల్లో ప్రఖ్యాతి పొందారు. ఆమె ఒక అగ్రశ్రేణి షూటర్. బీహార్ రాష్ట్రంలోని జముయీ నియోజకవర్గం నుంచి 1,23,868 ఓట్లతో విజయం సాధించారు. ఈమె దివంగత మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. శ్రేయసి తల్లి పుతుల్ కుమారీ ఎంపీగా పని చేశారు.

