జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ను బిహార్ శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నట్లు మంత్రి శ్రవణ్ తెలిపారు. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షనేతగా మాజీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ ఎన్నికయ్యారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఉపశాసనసభాపక్షనేతగా ఎంపికయ్యారు. వీరిని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు ఉత్తర్ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.

