టాలీవుడ్ సీనియర్ నటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల వయసులోనే తెరంగ్రేటం చేసిన తులసి, ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. ఆధ్యాత్మిక జీవితంలో శేష జీవితాన్ని గడపాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. తన 58 ఏళ్ల సినీ జీవితంలో ఛైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా 300లకు పైగా సినిమాల్లో నటించారు తులసి. రెండు నంది అవార్డులు,ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.. షిర్డిలో సెటిలై, మిగిలిన జీవితాన్ని సాయి సేవకి అంకితం చేయాలని అనుకుంటున్నట్టుగా ఆమె తలిపారు..

