సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్,సినీ నటి ఐశ్వర్యరాయ్ కూడా పుట్టపర్తి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సచిన్ టెండూల్కర్ తో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకుముందు, సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని సచిన్ టెండూల్కర్ దర్శించుకున్నారు. సాయి కుల్వంత్ హాల్లో బాబా మహా సమాధిని సినీ నటి ఐశ్వర్యరాయ్ దర్శించుకున్నారు.

