స్మార్ట్ఫోన్ల కారణంగా ఆన్లైన్ పేకాట, బెట్టింగ్‌ల వ్యసనం మెదక్ జిల్లా, నిజాంపేటలోని చల్మెడ వంటి గ్రామాలను చుట్టుముట్టింది. సుమారు 20 మంది యువకులు తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు ఆశించి, లక్షల రూపాయలు అప్పుల పాలయ్యారు. ఈ అప్పులు తీర్చడానికి తల్లిదండ్రులు తమకున్న పొలాలు, భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అధిక వడ్డీకి అప్పులిచ్చే ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులతో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

