హిందూపురం వైసీపీ ఇంచార్జ్ దీపికా రెడ్డి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారనిఈ దాడి చేశారు. ఎవరో హైదరాబాద్ లో ఉండే వాడి కాళ్ల కింద బతుకుతున్నాం.. వారికి ఓట్లు వేస్తాం, వారు హైదారబాద్‌లో కూర్చుంటాడు. మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నాం… అని ఆయన వ్యాఖ్యానించారు. వేణురెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి.. కార్యాలయంపై దాడి చేశారు. కార్యకర్తలపై భౌతికంగా దాడి చేయడం ప్రజాస్వామ్య నిబంధనల ప్రమాదకరమైన పతనాన్ని సూచిస్తుందని జగన్ అన్నారు.

