విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. ‘అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించుకోగలిగాం. భాగస్వామ్య సదస్సులు పెట్టినప్పుడు కేవలం పెట్టుబడులపైనే కాదు.. నాలెడ్జ్ పైనా చర్చ జరగాలి.

