బిహార్‌లో ఎన్డీఏ చరిత్రాత్మక విజయంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కీలక పరిణామం జరిగింది. ఎన్డీఏలోని కీలక పార్టీ రామ్ విలాస్ లోక్‌జన్ శక్తి అధినేత చిరాగ్ పాసవాన్, జేడీయూ చీఫ్, ప్రస్తుత సీఎం నీతీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. నీతీశ్ నేతృత్వంలో ఎన్డీఏ ఘన విజయాన్ని అందుకుందని, అందుకే అభినందించడానికి వెళ్లానని చిరాగ్ పాసవాన్ తెలిపారు. అయితే డిప్యూటీ సీఎం పదవి తమకు ఇవ్వాలని కోరేందుకే చిరాగ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

