బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్, ఈ ఎన్నికలు మొదటినుంచి న్యాయంగా జరగలేదని ఆరోపించారు. మహాగఠ్‌బంధన్‌పై విశ్వాసంతో ఓట్లు వేసిన లక్షలాది మంది బిహార్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ పోరాటమని తెలిపారు.

