బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎన్డీయే నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఎన్డీయే చేసిన ప్రజాసేవకు పట్టంకడుతూ ప్రజలు రీసౌండింగ్ తీర్పునిచ్చారని . ప్రధాని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులు పెట్టారు. ‘సుపరిపాలన విజయం సాధించింది. అభివృద్ధికి గెలుపు వరించింది. ప్రజాసంక్షేమ స్ఫూర్తి విజయం సొంతం చేసుకుంది. సామాజిక న్యాయం గెలిచింది’ అని మోదీ అన్నారు. ఎన్డీయేను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

