బీహార్ శాసనసభ ఎన్నికల తుది ఫలితాల్లో ఆశ్చర్యకరమైన అంశం మోదీకి చిరాగ్ పాశ్వాన్ నిలిచారు. ఒకప్పుడు ఒకే ఒక సీటుకు పరిమితమై.. రాజకీయాల్లో వెనక్కి నెట్టబడ్డారని భావించిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ.. ఇప్పుడు ఏకంగా 22 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతూ ఎన్డీయే కూటమికి అత్యంత బలమైన భాగస్వామిగా ఉద్భవించింది. చిరాగ్ పాశ్వాన్‌కు అప్పటి వరకు అంటగట్టిన ‘ఓటు కట్టర్’ అనే ముద్రను చెరిపివేసింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలోని ఎల్జేపీ(ఆర్వీ) చరిత్రలో ఇదే అత్యుత్తమ అసెంబ్లీ ఎన్నికల ప్రదర్శనగా నిలిచింది..

