ఎంతో ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే జరిగింది. 10 రౌండ్లు పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యం భారీ పెరుగుతూ వచ్చింది. 2009లో రాజకీయంలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్ 16 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం వెలుగుచూసింది. ఎంఐఎంలో ప్రస్థానం ప్రారంభించిన నవీన్ యాదవ్.. 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

