టాలీవుడ్ హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ పెళ్లి వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆమె తారసపడ్డారు. దీంతో కేటీఆర్ ఆమెను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా శ్యామల దేవి అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెక్స్‌ట్ అధికారం మనదే అని కేటీఆర్‌తో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి అన్నారు. కేటీఆర్ కూడా స్పందిస్తూ శ్యామల దేవికి థ్యాంక్స్ చెప్పారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

