సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు అందరికి పరీక్ష ఫీజులు తానే చెల్లిస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ముందుకొచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థుల వివరాలను తనకు అందజేయాలని కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ కలెక్టర్ హరిచందనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం లేఖ రాశారు. ప్రభుత్వం తనకు ఇచ్చే వ్యక్తిగత వేతనం నుంచే వీరికి పరీక్ష ఫీజులు చెల్లించాలని నిర్ణయించుకుని ఆ ప్రకటన చేశారు.

