వైఎస్ జగన్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా నా ఆశీస్సులు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని పీపీపీ కాదని.. పీపీబీ (బిలియనర్ల ప్రోగ్రామ్) అని ఆరోపించారు. మెడికల్ కాలేజీలను నారాయణ కొన్నా, మరెవరు కొన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పాలించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తనకు తెలుసని అన్నారు.

