ఢిల్లీ పేలుడు ఘటనలో అనుమానిత స్పోర్ట్స్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నట్లు ఫరీదాబాద్ పోలీసులు ప్రకటించారు. ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసిన ఉన్న కారును స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాది డా.ఉమర్ పేరుపై రిజిస్టర్ అయిన ఎకో స్పోర్ట్స్ కారు DL10CK0458 కోసం ఢిల్లీ, హర్యానా, కశ్మీర్, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉదయం నుంచి గాలించారు. ఆ కారు డాక్టర్ ఉమర్ కు చెందిన ఖండవాలి ఇంటి వెలుపల ఆపి ఉంచినట్లు అధికారులు తెలిపారు.

